యూపీలో జరుగుతున్న మహాకుంభామేళాకు సోమవారం మంత్రి నారా లోకేశ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకొని అక్కడి నుంచి ప్రయాగరాజ్ వెళ్లనున్నారు. నెల రోజులుగా జరుగుతున్న ఈ ఆధ్యాత్మిక వేడుకలో ఇప్పటి వరకు 55 కోట్ల మధ్య భక్తులు పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు.