మాగనూరు: ఎంజెపివిసి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవం
నారాయణపేట జిల్లా మాగనూరు మండలం పరిధిలోని కొల్పూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సమాచార హక్కు చట్టం 2005 అక్టోబర్ 12 అమలుపరిచిన ఎంజెపివిసి దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంజెపివిసి వ్యవస్థాపకులు కెవి నరసింహ మాట్లాడుతు, సమాచార హక్కు చట్టం 2005 సామాన్య ప్రజల చేతిలో వజ్రాయుధంల, బ్రహ్మస్త్రంల పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బంగి ఉమేష్, రాము, బంగి రంగనాథ్, తదితరులు పాల్గొన్నారు.