జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి చేయడాన్ని NBF (నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ ఫెడరేషన్) ఖండించింది. న్యూస్ కవరేజీ కోసం తన ఇంటికి వెళ్లిన జర్నలిస్ట్ రంజిత్‌పై చేసిన మాటలదాడి, భౌతికదాడి హేయమైనదని NBF అభిప్రాయపడింది. సంబంధిత ప్రభుత్వ శాఖలు మోహన్‌బాబు దాడి ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని కోరింది. భవిష్యత్‌లో ఇలాంటి దాడుల్ని నిరోధించేలా కఠినచట్టం తేవాలని డిమాండ్ చేసింది.