హైదరాబాద్‌లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్. మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఎల్‌బీ నగర్ నుంచి హయత్ నగర్‌ను కలుపుతూ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) జనవరి 12న రూట్ మ్యాప్‌ను ప్రకటించింది. కొత్త మార్గంలో 7.1 కిలోమీటర్ల పొడవున మెట్రో ట్రాక్ నిర్మిస్తారు. ఈ మెట్రో విస్తరణలో మొత్తం ఆరు స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.