శుభాకాంక్షలు తెలిపిన సతీష్ రెడ్డి

74చూసినవారు
శుభాకాంక్షలు తెలిపిన సతీష్ రెడ్డి
కడెం మండలంలో ఉన్న ముస్లిం సోదరులకు యువజన కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు పి. సతీష్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పురస్కరించుకొని గురువారం కడెం మండలం కేంద్రంలో ఉన్న ముస్లిం సోదరులను కాంగ్రెస్ నాయకులు కలిశారు. అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మల్లేష్ యాదవ్, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు రవి వర్మ, తదితరులు పాల్గొన్నారు.