ఖానాపూర్: కోతుల బెడద.. వినూత్నంగా ఆలోచించిన షాపు యజమాని
ఖానాపూర్ పట్టణ కేంద్రంలో కోతుల బెడదతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. గుంపులు గుంపులుగా కోతులు వచ్చి షాపుల్లోని నిసామాగ్రిని ఎత్తుకుపోతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీలక్ష్మి కిరాణా జనరల్ స్టోర్ యజమాని చంద్ర ప్రకాష్ వినూత్నంగా ఆలోచించి షాపు ముందు కొండెంగల ఫోటోలతో రెండు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాడు. కోతుల బెడదతో కొండెంగల ఫోటోలు పేట్టినట్లు షాపు యజమాని తెలిపారు.