

రామాపురం బీచ్‌లో విషాదం.. ఒకరు మృతి (వీడియో)
AP: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో బుధవారం విషాదం చోటు చేసుకుంది. పర్చూరు నెహ్రూ కాలనీకి చెందిన చుక్కా వంశీ, రాజేశ్‌లు సముద్రంలో అలల తాకిడికి కొట్టుకుపోయారు. మెరైన్ పోలీసులు వెంటనే స్పందించి సముద్రంలోకి వెళ్లి యువకులను ఒడ్డుకు తీసుకొచ్చారు. వంశీ (27) పరిస్థితి విషమించడంతో చీరాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు.