వక్ఫ్ చట్టం, 1995కి ప్రతిపాదిత సవరణలను ముస్లిం సమాజంతోపాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ మార్పులు వక్ఫ్ సంస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తాయని, మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తాయని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ముస్లిం మహిళలు బిల్లుకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. ‘థాంక్యూ మోదీజీ’ అంటూ పీఎం ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.