ఖానాపూర్ నియోజకవర్గం, కడెం మండలం, అల్లం పల్లి గ్రామంలో జరిగిన సీతారామచంద్రస్వామి ధ్వజ స్తంభ ప్రతిష్ఠ మహోత్సవంలో శుక్రవారం కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం జీయర్ గురుకులం, జూనియర్ కళాశాలను ప్రారంభించారు.