Feb 24, 2025, 02:02 IST/నిర్మల్
నిర్మల్
నర్సాపూర్ (జి): రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Feb 24, 2025, 02:02 IST
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం నర్సాపూర్ (జి) మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం భైంసాకు చెందిన జంగ్మె సంతోష్(28), గౌతమ్ ఒక ప్రైవేటు రుణాలిచ్చే కంపెనీలో పని చేస్తున్నారు. నిర్మల్లో పని ముగించుకుని తిరిగి భైంసాకు వెళ్తున్న క్రమంలో నర్సాపూర్ (జి) పోలీస్ స్టేషన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన డంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ సంతోష్ మృతి చెందినట్లు తెలిపారు.