ఆసుపత్రిలో మరణిస్తే.. తప్పనిసరిగా కార్నియా సేకరణ

85చూసినవారు
ఆసుపత్రిలో మరణిస్తే.. తప్పనిసరిగా కార్నియా సేకరణ
ఆసుపత్రిలో ఎవరైనా మరణిస్తే.. కార్నియా దానానికి అనుమతి ఇచ్చినట్లే అని భావించి తప్పనిసరిగా దాన్ని మృతదేహం నుంచి సేకరించే అవకాశాలను తాము పరిశీలిస్తున్నట్లు జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ(నొట్టో) సంచాలకుడు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. ఇందుకోసం చట్టపరంగా ప్రత్యేక వ్యవస్థను రూపొందించాలంటూ తమకు ఓ సూచన అందిందన్నారు. దాన్ని అమలు చేయాలంటే మానవ అవయవ, కణజాల మార్పిడి చట్టాన్ని సవరించాల్సి ఉంటుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్