కుంటాల మండలం కల్లూరు గ్రామంలో రెండవ షిర్డీ సాయిబాబా ఆలయంగా పిలువబడే బాబా ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి అష్టోత్తర శతనామావళి మధ్య పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. తదుపరి బాబాకు దీప ధూప నైవేద్యం సమర్పించారు. భక్తులు బాబా వారిని దర్శించుకుని సాయిబాబా జీవిత చరిత్రను పారాయణ చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు