తానూర్ మండలం ఉమ్రీ (కే) గ్రామంలో సాహిత్య రత్న అన్న భావు సాటే కమ్యూనిటీ హాల్ నిర్మాణ కొరకు రూ. 2 లక్షల యాభై వేలు మంజూరైనట్లు మాజి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. మంజూరైన ప్రొసీడింగ్ కాపీని ఆదివారం కమిటీ సభ్యులకు అందజేశారు. దీంతో కమిటీ సభ్యులు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న అన్న భావు సాటే ముధోల్ అధ్యక్షులు ఉత్తం భలే రావు తదితరులు ఉన్నారు.