టైర్ ఊడిపోయి ట్రాక్టర్ బోల్తా

67చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత నటరాజ్ మిల్ సమీపంలో టైర్ ఊడిపోయి ట్రాక్టర్ బోల్తా పడింది. సోమవారం నిర్మల్ రూరల్ మండలం తాంశ గ్రామ శివారు నుంచి కొండాపూర్ గ్రామానికి ఇటుక లోడుతో ట్రాక్టర్ వెళ్తుంది. పాత నటరాజ్ మిల్ సమీపంలోకి రాగానే ట్రాక్టర్ ట్రాలీ వెనక టైర్ ఊడిపోయి బోల్తా పడింది. ఊడిన టైరు పక్క నుండి వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనం ధ్వంసమైంది. ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్