భారత్, అమెరికాలు హిందూ మహాసముద్రంలో భారీ యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. ఇందులో ఇరు దేశాల అగ్రశ్రేణి యుద్ధనౌకలు పాలుపంచుకున్నాయి. అమెరికాకు చెందిన విమానవాహక నౌక థియోడోర్ రూజ్‌వైల్ట్ నేతృత్వంలోని క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కూడా భాగస్వామ్యం వహించింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ విన్యాసాలకు ప్రాధాన్యం ఏర్పడింది.