ఆర్మూర్ పట్టణంలో పత్రీజీ ధ్యాన మహా యజ్ఞం శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్టల్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు. నేటి నుంచి నెల 30 వరకు పత్రీజీ ధ్యాన మహా యజ్ఞం కార్యక్రమంలో భాగంగా గురువుల ప్రవచనం, ధ్యాన సంగీతం, సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని పిఎస్ఎస్ఏం జిల్లా అధ్యక్షుడు సాయి కృష్ణ రెడ్డి తెలిపారు.