కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజురోజుకు పిచ్చికుక్కల స్వైర విహారం ఎక్కువయింది. బుధవారం 45, 46, 47, 31 వార్డులలో నడుచుకుంటూ వెళ్తున్న ఆరుగురు మహిళలపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. గమనించిన స్థానికులు వెంటనే ఆంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. సంబంధిత అధికారులు స్పందించి ప్రజలు పిచ్చికుక్కల బెడదను తొలగించాలన్నారు.