
నిజామాబాద్: 8 మంది పేకాట రాయుళ్ల అరెస్టు
మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమ్రాద్ గ్రామ శివారులో శుక్రవారం పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేసి 8 మంది పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 6 ద్విచక్ర వాహనాలు, 8 సెల్ ఫోన్ లు, రూ. 7740 నగదు స్వాధీనం చేసుకున్నారు.