Mar 09, 2025, 04:03 IST/నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్ అర్బన్
నిజామాబాద్: అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరి అరెస్ట్
Mar 09, 2025, 04:03 IST
నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్లోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా భైంసా, తానూర్, బాసరలో బైక్ ల దొంగతనం, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడలో దోపిడీ నేరాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షేక్ ఇమ్రాన్, షేక్ అర్బాజ్లను అరెస్ట్ చేశామని, మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.