AP: బర్డ్ ఫ్లూ దెబ్బకు కోళ్ల పరిశ్రమ కుదేలవుతోంది. ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రంలో 1200కు పైగా కోళ్ల ఫామ్‌లు ఉండగా.. వాటిలో 5.60 కోట్లకు పైగా కోళ్లు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ దెబ్బకు లక్షలాది కోళ్లు మృత్యువాతపడ్డాయి. అయితే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వైరస్ ఉధృతి దాదాపు తగ్గుముఖం పట్టింది. వైరస్ గుర్తించిన ప్రాంతాల్లో రెడ్ జోన్ సహా ప్రభుత్వ హెచ్చరికలన్నీ ఉపసంహరించారు. అయినా అమ్మకాలు ఏమాత్రం ఊపందుకోలేదు.