AP: రాష్ట్రంలో 2 గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళంలో విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. వీటికి సంబంధించి ప్రీ-ఫిజిబిలిటిని పరిశీలించేందుకు.. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు కన్సల్టెంట్లల నియామకానికి ఏపీఏడీసీ టెండర్లు పిలిచింది. ఆన్‌లైన్‌లో టెండర్ల దాఖలుకు ఈ నెల 21 వరకు గడువు ఇచ్చింది.