AP: ఉగాది నుంచి రాష్ట్రంలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు 16 జిల్లాల్లో శనివారం నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏపీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.