Dec 28, 2024, 03:12 IST/
కేటీఆర్కు ఈడీ నోటీసులు
Dec 28, 2024, 03:12 IST
TG: ఫార్ములా ఈ-రేసు కేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 7న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు, HMDA మాజీ చీఫ్ ఇంజినీర్ BLN రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3న విచారణకు రావాలని అరవింద్, బీఎల్ఎన్ రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎంఎల్ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది.