ఇకపై శ్రీలంకలోనూ ఫోన్ పే సేవలు!

50చూసినవారు
ప్రముఖ యూపీఐ లావాదేవీ సంస్థ ఫోన్ పే శ్రీలంకలో సేవల్ని ప్రారంభించింది. శ్రీలంకలోని భారత హైకమిషన్ ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించింది. అక్కడికి వచ్చే భారతీయులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు శ్రీలంకలోని లంకాపేతో కలిసి తాము ఆపరేట్ చేస్తున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. భారతీయులు వారి ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పే చేయొచ్చని, నగదును వెంటే తీసుకెళ్లనక్కర్లేదని పేర్కొంది.