శామ్‌సంగ్ కంపెనీకి నిరసన సెగ

85చూసినవారు
శామ్‌సంగ్ కంపెనీకి నిరసన సెగ
ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ, దక్షిణ కొరియా ప్రధాన కేంద్రంగా ఉన్న శామ్‌సంగ్‌లో ఉద్యోగులు మునుపెన్నడూ లేనివిధంగా నిరసనకు దిగారు. సౌత్‌కొరియాలోని సియోల్‌లో ఉన్న ప్రధాన కార్యాలయం ముందు కంపెనీ చిప్ డివిజన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు లౌడ్ స్పీకర్లలో నిరసన పాటలు ప్లే చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వేతనాల పెంపు, బోనస్‌లపై యాజమాన్యం స్పందించకపోవడంతో ఆందోళన ప్రారంభించినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత పోస్ట్