దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య కొరలు విస్తరిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో క్షీణిస్తోంది. దీంతో అధికారులు కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. దుమ్ము వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీలో వాటర్ స్ప్రింక్లర్లను ఉపయోగిస్తున్నారు. వాటర్ ట్యాంకర్లను ఉపయోగించి నగరంలోని రోడ్లపై నీటిని చల్లడం ప్రారంభించారు.