జాతీయ పోషకాహార మాసం సందర్భంగా ఐరన్ పుష్కలంగా ఉండే 6 ఆహార పదార్థాలను తెలిపిన కేంద్రం

79చూసినవారు
జాతీయ పోషకాహార మాసం సందర్భంగా ఐరన్ పుష్కలంగా ఉండే 6 ఆహార పదార్థాలను తెలిపిన కేంద్రం
మన శరీరంలోని అన్ని వ్యవస్థలు సరిగ్గా పనిచేయడానికి, శరీరానికి అవసరమైన పోషకాహారాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ మేరకు సెప్టెంబర్ 1-30 వరకు జాతీయ పోషకాహార మాసం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల జాబితాను 'ఎక్స్' ద్వారా తెలిపింది. తోటకూర, గుడ్లు, ఎండు ద్రాక్ష, మాంసం, శనగలు, రాగులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకొని ఐరన్ లోపం, రక్తహీనతను నివారించి భారత్ ను పౌష్టికరమైన, దృఢమైన దేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం పేర్కొంది.

సంబంధిత పోస్ట్