శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు

78చూసినవారు
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 2,49,394 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 4,14,128 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 200.6588 టీఎంసీలు ఉంది. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్