మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. గాయపడిన భారత జవాన్

79చూసినవారు
మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్..  గాయపడిన భారత జవాన్
సరిహద్దుల్లో మరోసారి దాయాది కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం తెల్లవారుజామున జమ్మూ సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)‌కు చెందిన జవాన్ ఒకరు గాయపడినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత సైనికులు ధీటుగా బదులిచ్చారని, పాక్‌వైపు ఎంత మంది గాయపడ్డారనేది తెలియరాలేదని అధికారులు తెలిపారు. 2021లో భారత్‌, పాక్‌ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్