మోదీ ప్రభుత్వం మూడోసారి కొలువు తీరింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ సమావేశాలు జూన్ 18, 19వ తేదీన ప్రారంభం కానున్నాయని ఢిల్లీ వేదికగా చర్చ జరుగుతోంది. తొలి రోజు ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం ప్రోటెం స్పీకర్‌ను రాష్ట్రపతి ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. ఆ వెంటనే స్పీకర్‌ను ఎంపిక చేసే అవకాశాలు సైతం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సమావేశాలు అతి కొద్ది రోజులు మాత్రమే జరుగుతాయని టాక్.