సుల్తానాబాద్ మండలంలోని గట్టేపల్లి గ్రామంలో శనివారం నాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గట్టెపల్లి గ్రామంలో గ్రామ వాస్తవ్యులు ఆరే సతీష్ నిర్మిస్తున్న 40 ఫీట్ల భారీ హనుమాన్ విగ్రహం పై శనివారం ఉదయం వానరం వచ్చి రెండు గంటలపాటు హనుమాన్ విగ్రహం పై ఉండి స్థానికులను ఆశ్చర్యపరిచింది. ఈ వానరం ఇలా హనుమాన్ విగ్రహం పై రావడం శుభసూచకమని స్థానికులు అభిప్రాయపడ్డారు.