
పెద్దపల్లి: 'ప్రభుత్వ ప్రధానోపాధ్యాయున్ని విధుల నుంచి తొలగించాలి: ఏబీవీపీ
విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ ప్రధానోపాధ్యాయుడుని విధుల నుంచి తొలగించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు జిల్లా విద్యాధికారి కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ మాట్లాడుతూ. పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి గ్రామంలో విద్యార్థినుల పట్ల జరిపిన చర్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.