ఎర్రబస్సు ఎరుగని పాలకుర్తి మండల కేంద్రం

64చూసినవారు
ఎర్రబస్సు ఎరుగని పాలకుర్తి మండల కేంద్రం
పాలకుర్తి మండల కేంద్రంలోని లక్ష్మీపురం, ఈశాల తక్కల్లపల్లి గ్రామాల ప్రజలు ఇప్పటికీ కూడా ఎర్రబస్సు ఎక్కడానికి నోచుకోవడంలేదు. గతంలో గోదావరిఖని డిపో నుండి ఈశాల తక్కల్లపల్లి గ్రామం వరకు ఉదయం, సాయంత్రం రెండు ట్రిప్పులు నడిచే బస్సు ఏడాదిన్నర నుండి పూర్తిగా రద్దు చేశారు. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువగానే ఉందని, అయినా బస్సును ఎందుకు రద్దు చేశారో అర్థం కావడంలేదని గ్రామాల ప్రజలు శుక్రవారం విచారం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్