పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ సకాలంలో అందజేయాలి: కేంద్రం

79చూసినవారు
పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ సకాలంలో అందజేయాలి: కేంద్రం
పెన్షన్ కేసుల విచారణలో జాప్యం జరుగుతోందని, దీని వల్ల కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్రం భావించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే నాటికి పెన్షన్ సమస్యలను పరిష్కరించి పెన్షన్‌ను అందజేయాలని ఆదేశించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి CCS (పెన్షన్) రూల్స్, 2021లో నిర్దేశించిన సమయపాలనలను ఖచ్చితంగా పాటించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కస్టమ్స్ విభాగం అధికారులను కోరుతూ మెమోరాండం జారీ చేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్