యూట్యూబర్ హర్షసాయి కోసం నార్సింగి పోలీసులు గాలిస్తున్నారు. యువతి ఫిర్యాదుతో అతడిపై అత్యాచారం కేసు నమోదైంది. విశాఖతో పాటు మరికొన్ని చోట్ల అతడి కోసం బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలిస్తున్నారు. హర్ష పరారీలో ఉన్నాడా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పోలీసులు ఆయనపై 376(2), 376N, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.