ప్రముఖ పాప్ సింగర్ లియామ్ పైన్ (31) బుధవారం మృతి చెందారు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో ఓ హోటల్ బాల్కనీ నుంచి జారిపడి ఆయన అక్కడికక్కడే మరణించారు. ఓ లైవ్ కన్సర్ట్ లో పాల్గొనేందుకు పైన్ అక్కడికి వెళ్లారు. కాగా లండన్ కు చెందిన పైన్ 'వన్ డైరెక్షన్' పాప్ బ్యాండ్ తో పేరు పొందారు. హార్రీ స్టైల్స్, జేన్ మాలిక్, నియాల్ హోరన్, లూయిస్ టామ్లిన్సన్ తో కలిసి ఆయన ప్రదర్శనలు ఇచ్చారు.