భారతీయుల అరెస్ట్‌పై స్పందించిన కెనడా ప్రధాని

60చూసినవారు
భారతీయుల అరెస్ట్‌పై స్పందించిన కెనడా ప్రధాని
తమ దేశంలో చట్టబద్ధమైన పాలన ఉందని కెనడా ప్రధాని జస్టిస్‌ ట్రూడో వ్యాఖ్యానించారు. బలమైన, స్వతంత్ర న్యాయ వ్యవస్థ కలిగి ఉందని, దేశ పౌరులను రక్షించడం తమ ప్రాథమిక విధి అని అన్నారు. ఖలిస్థానీ వేర్పాటు వాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసుతో సంబంధముందని ముగ్గురు భారత జాతీయులను కెనడా పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టులపై ట్రూడో స్పందించారు. రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ దర్యాప్తు కొనసాగుతోందని ట్రూడో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్