రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి.. భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆవామీ లీగ్ పార్టీ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ముందుగా దాడి చేసిన ఆందోళనకారులు.. విలువైన వస్తువులను చోరీ చేశారు. ఆపై బంగళాను తగులబెట్టారు.