జైలులో కేజ్రీవాల్‌ను కలవనున్న పంజాబ్ సీఎం

1047చూసినవారు
జైలులో కేజ్రీవాల్‌ను కలవనున్న పంజాబ్ సీఎం
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తిహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో బుధవారం భేటీ కానున్నారు. మాన్ వెంట ఇటీవల జైలు నుంచి రిలీజైన ఆప్ నేత సంజయ్ సింగ్ సైతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ ఈ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగా నేడు కేజ్రీవాల్ సతీమణి సునీత తిహార్ జైలులో ఆయనను కలుసుకున్నారు. అరెస్ట్ తర్వాత వీరు భేటీ కావడం ఇదే తొలిసారి.

ట్యాగ్స్ :