ఢిల్లీలోని మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని కొందరు పంజాబ్ మహిళలు ముట్టడించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నెలకు రూ.1000 ఇవ్వడంలేదని, కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు తమను మోసగించారని ఆరోపించారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు మంచి అవకాశం వచ్చిందని, తమలాగా మోసపోవద్దని సూచించారు. కాగా, కేజ్రీవాల్ దీనిపై స్పందిస్తూ ఆ మహిళలు బీజేపీ, కాంగ్రెస్ వాళ్లని ఆరోపించారు.