AP: విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు నక్కపల్లి కృష్ణ, దొండపర్తి రాంబాబుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.