కోల్‌కతా డాక్టర్ హత్యాచారంపై స్పందించని రాహుల్ గాంధీ

604చూసినవారు
కోల్‌కతా డాక్టర్ హత్యాచారంపై స్పందించని రాహుల్ గాంధీ
కోల్‌కతాలోని RG కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించేందుకు నిరాకరించారు. తాను బరేలీలో హత్యకు గురైన దళిత యువకుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చానని పేర్కొన్నారు. బరేలీ ఘటనను దారి మళ్లించడం తనకు ఇష్టం లేదన్నారు. ఇప్పటికే కోల్‌కతా ఘటనపై తన అభిప్రాయం చెప్పినట్లు వెల్లడించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you