క్రూరం... దారుణం... ఆటవికం... అంటూ కోల్‌కతా దుర్ఘటన పట్ల యావద్దేశమూ గొంతెత్తింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నది. ఈ సమయంలోనే మహారాష్ట్రలోని బాద్లాపూర్‌లో ఇద్దరు మైనర్ అమ్మాయిలపై, అస్సాం రాజధాని గౌహతిలో విద్యార్థినిపై, హిమాచల్ ప్రదేశ్‌లో నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారాలు జరిగాయి. ‘వి వాంట్ జస్టిస్’ అని ప్రదర్శనలో అరచిన ఆడబిడ్డల గొంతుల తడారక ముందే ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి.