రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో స్థానిక పోలీసులు సోమవారం సాయంత్రం నుండి డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో భాగంగా మద్యం మత్తులో వ్యక్తి పోలీసులకు సహకరించకుండా హల్చల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ ట్రాఫిక్ సిబ్బంది వారు సైదాబాద్ పోలీసులకు మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అప్పగించినట్లు పేర్కొన్నారు.