

జూబ్లీహిల్స్: చెస్ట్ ఆసుపత్రిలో మద్యం సేవిస్తూ చిక్కిన వార్డు బాయ్
ఎర్రగడ్డలోని ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ప్లాంట్ వద్ద డ్యూటీ సమయంలో బుధవారం మద్యం తాగుతూ వార్డు బాయ్ పట్టుబడ్డాడు. ప్రాణాలు ఆధారపడే చోట ఇలాంటి పనులు చేయడం ఏంటని రోగులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఉద్యోగులను తక్షణమే తొలగించాలని కోరుతున్నారు.