హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో మంగళవారం జరిగిన ప్రెస్ మీట్‌లో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. "రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్టు పాలన సాగుతోంది. యూనివర్సిటీ భూములు అమ్మి సంక్షేమ పథకాలు అమలు చేస్తామనడం తప్పు, " అని చెప్పారు. "విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం శోచనీయం, భూములను అమ్మే ఈ చర్యను ఆపేలా పోరాటం చేస్తాం, " అన్నారు.