

బంజారాహిల్స్: బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి
బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఖాజా పక్కనే ఉన్న బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై దాడి చేశాడు.