మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో మంగళవారం తమ సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన మహిళలు లిఫ్టులో 40 నిమిషాల పాటు ఇరుక్కుపోయారు. స్థానికంగా నివాసం ఉండే ఆరుగురు మహిళలు సర్కిల్ కార్యాలయంలోని రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్టు ఎక్కారు. ఓవర్‌లోడ్ చూపించిన లిప్టు మొదటి ఫ్లోర్ వద్ద నిలిచిపోయింది. ఆటోమేటిక్ డోర్లు కావడంతో తెరుచుకోలేదు. సాంకేతిక నిపుణులు వచ్చి తెరవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.