పవన్, నారా లోకేశ్‌కు నో ఛాన్స్!
ఏపీ ప్రభుత్వం 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ను దూరం పెట్టింది. వీరికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోవడంతో.. నలుగురు మంత్రులకు రెండేసి జిల్లాల బాధ్యతలు అప్పగించింది. జనసేన మంత్రులకు ఏలూరు, గుంటూరు జిల్లాల బాధ్యతలు ఇచ్చింది. బీజేపీ మంత్రికి ఎన్టీఆర్ జిల్లా బాధ్యతలు అప్పజెప్పింది.