మద్యం షాపులు దక్కించుకున్న వారికి సిండికేట్లు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. అయితే దుకాణాల నిర్వహణకు దాదాపు రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత స్థోమత లేని వారిని గుర్తించి.. షాపు వదిలేస్తే రూ.కోటి నుంచి రూ.1.2 కోట్లు ఇస్తామని చెబుతున్నారట. అలాగే గుడ్ విల్ కింద నెల నెలా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారట. దాంతో డ్రాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.